వంగవీటి మోహన రంగాకి నిజమైన వారసుడు బోండా ఉమనే
విజయవాడ: పెద్ద ఎత్తున అమరజీవి ప్రజా నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి వేడుకలు మంగళవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ దుర్గపురం సంబమూర్తి రోడ్డు NTR గారి విగ్రహం వద్ద 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకొని ఫ్రూట్స్, పుస్తకాలు,బట్టలు,మహిళలకు చీరలు,పంపిణీ చేయడం జరిగినది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టిడిపి పోలిట్ బ్యూరోసభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాకి ఆనాడు శిష్యులుగా ఉండి ఆనాడు ఆయన చూపినటువంటి మార్గంలో ఈనాడు ఆదర్శంగా ముందుకు నడవడంతో పాటు నారా చంద్రబాబునాయుడు లోకేష్ నాయకత్వ లక్షణాలను కూడా చేయకపోతే వంగవీటి మోహన రంగా ఆశయాల కోసం నేడు పోరాటం చేయడం జరుగుతుందన్నారు.
భూమికోసం ముక్తి కోసం శ్రమజీవులు శక్తి కోసం నిరంతరం పేద ప్రజల పక్షాన నిలిచేటువంటి వంగవీటి మోహన రంగారావుకి అనుచరుడిగా నిలబట్టాలనుంచి కడవరకు పోరాటం చేసినటువంటి వంగవీటి మోహనరంగా రావు ఆశయాలను సాధిస్తూ ఈనాడు 40 సంవత్సరాలుగా నగరంలో ఉన్నటువంటి పేద ప్రజల అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు కట్టించి ఇళ్ళలో ఇవ్వాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడుని ఒప్పించి ఇక్కడ ఇల్లు కట్టించినటువంటి మహనీయుడు అలాంటి ఇళ్లను ఈ వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా విసిగించడం సరికాదు అని అన్నారు.
35 సంవత్సరాలు అయినా భౌతికంగా మన మధ్య దూరమయ్యారే తప్ప మానసికంగా ప్రజల హృదయాలలో ఉన్నటువంటి మహనీయులు మన వంగవీటి మోహన రంగా అని ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు.
1982వ సంవత్సరం లో ఇండిపెండెంట్ గా సైకిల్ గుర్తు మీద కార్పొరేటర్ గా గెలిచినటువంటి వంగవీటి మోహనరంగా 1985లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో పెద్ద పెట్టున ముందుఉన్నటువంటి మహనీయులు ప్రజా నాయకులు ప్రజా సేవకుడు వంగవీటి మోహన రంగా అని చెప్పారు.
వంగవీటి మోహన రంగా కులమతాలకు అతీతంగా SC, ST, BC, మైనార్టీలకు పెద్ద ఎత్తున హక్కుల చేర్చుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి ముందు ఉండటమే కాకుండా ఇల్లు లేని నిరుపేదలు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విజయవాడలో నివసిస్తున్నటువంటి వారి అందరికీ ఇళ్ల పట్టాలు గురించి కడవరకు పోరాడినటువంటి పేద ప్రజల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారిని ఆనాడు అరాచకం చేసేటువంటి గుండాల గుండెల్లో నిద్రపోయినటువంటి నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పినటువంటి శాంతి కామకుడు వంగవీటి మోహన రంగా గారిని తాము చిన్ననాటి నుండి వంగవీటి మోహన రంగా గారి అనుచరుల కింద జీవితం ప్రారంభించి వంగవీటి మోహన రంగా గారిని ఆదర్శంగా తీసుకొని ఈ స్థాయి వరకు చేరుకున్నామని వంగవీటి మోహన రంగా ఆశయాల కోసం తాము కడవరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి పేద ప్రజల పక్షాన నిలబడతామని ప్రజా సమస్యల కోసం అధికారంలో ఉన్న లేకున్నా ఎమ్మెల్యేగా అయినా కాకపోయినా రంగా గారు చూపిన మార్గంలోనే ముందుకు నడవటం మా కర్తవ్యం గా భావిస్తూ ఈ 35వ వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుని పోతామని ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు….
ఈ కార్యక్రమంలో టిడిపి టిడిపి రాష్ట్ర కార్యదర్శి డివిజన్ ఇంచార్జ్ నవనీతం సాంబశివరావు, కొండపావులూరి బాబు దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, జక్కుల శ్రీనివాస్ మంటాడ శివరామకృష్ణ,వెంట్రప్రగడ శ్రీను, గుడివాడ దీపక్, డిమార్ట్ రవణమ్మ, బండారు కొండ,హరి,గుగ్గిలపు శ్రీను,శ్రీనివాస్,కొలవెన్ను వెంకన్న, కొలవెల్లి ప్రకాష్, లతోపాటు పెద్ద ఎత్తున వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. (Story: వంగవీటి మోహన రంగాకి నిజమైన వారసుడు బోండా ఉమనే)
See Also:
రెస్పాన్స్ బట్టి డెవిల్‌కు సీక్వెల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? హిందూ వనితకు నుదుట తిలకం తప్పదా?