Home టాప్‌స్టోరీ సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ రిలీజ్

సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ రిలీజ్

0
Sarkaru Vaari Paata's Second Single Penny
Sarkaru Vaari Paata's Second Single Penny

సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ రిలీజ్

సర్కారు వారి పాట చిత్రం నుండి  సూపర్ స్టార్ మహేష్ బాబు, సితార కలిసి నటించిన పెన్నీ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా  పరశురామ్ దర్శకత్వం లో వస్తున్న  యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట. వేసవిలో సినిమా అభిమానులకు ‘సూపర్ స్పెషల్’ ట్రీట్‌ను అందించడానికి మే 12న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా విడుదలకు  సిద్ధమవుతుంది.

రెండవ పాట, పెన్నీ వీడియో సాంగ్ ద్యారా మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని  సిల్వర్ స్క్రీన్ కి తొలిసారి గా పరిచయం అయింది , ఈ పాట తండ్రీ-కూతురు ద్వయం అందమైన నృత్యముతో రూపొందింది. ముందుగా నిన్న విడుదలైన ఈ పాట ప్రోమోకు విశేష స్పందన లభించింది. పూర్తి పాట దానిపై ఉన్న హైప్‌ని  మించిపోయింది.

సితార ఒక రాక్‌స్టార్ లా తన డ్యాన్స్ నైపుణ్యాలతో ఆకట్టుకుంది.  దానితో పాటు తన హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు చాలా అందం గా  కనిపించాడు. అంతేకాక తన స్టైల్ తో మెస్మరైజ్ చేసాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు.

తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
CEO: చెర్రీ
VFX సూపర్‌వైజర్ – యుగంధర్ (Story: సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ రిలీజ్)

See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version