Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ, సిసి రోడ్లు, డ్రైన్లు, లో లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనులకు...

గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ, సిసి రోడ్లు, డ్రైన్లు, లో లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనులకు 8.60 కోట్లు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ, సిసి రోడ్లు, డ్రైన్లు, లో లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనులకు 8.60 కోట్లు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రూ.8.60 కోట్లతో అభివృద్ధిపనులు..

వయ్యకల్లు సభలో జీవీ ఆంజనేయులు వెల్లడి

రూ. 50లక్షలతో లో లెవల్ బ్రిడ్జికి శంకుస్థాపనచేసిన జీవీ

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో రూ.8.60 కోట్లనిధులు మంజూరైనట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వెల్లడించారు. శావల్యాపురం మండలం, వయ్యకల్లు గ్రామంలో రూ.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో లో-లెవల్బ్రిడ్జికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీని పెంచుతున్నామని,సీసీరోడ్లు, డ్రైన్లు, లో లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసినట్లు వెల్లడించారు. వయ్యకల్లులో రూ.50 లక్షలతో లో లెవల్ బ్రిడ్జితోపాటు,  రూ.18 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.శానంపూడి గ్రామంలో రూ.40 లక్షలతో బ్రిడ్జి నిర్మాణంకు శంకుస్థాపన చేశామన్నారు.అదేవిధంగా విఠంరాజుపల్లి పిచికలపాలెం రోడ్డు నిర్మాణానికి రూ.3.40కోట్లు,గంటావారిపాలెం-వెలమావారిపాలెం రోడ్డుకు రూ. 84 లక్షలు, ఈపూరు – ఊడిజర్ల రోడ్డుకురూ.1.కోట్లుతో సహా మొత్తంగా 5 రోడ్లకి రూ.8.60 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం విడుదల చేయటం శుభపరిణామనన్నారు. గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, సొసైటీ చైర్మన్ గడిపూడి విశ్వనాథం, యరమాసు కోటేశ్వరరావు, గోరంట్ల హనుమంతరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు , తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ, సిసి రోడ్లు, డ్రైన్లు, లో లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనులకు 8.60 కోట్లు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments