Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు అందజేసిన జీవి

టీడీపీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు అందజేసిన జీవి

0

టీడీపీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు అందజేసిన జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మండలం, నడిగడ్డ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాడిపర్తి నాగలక్ష్మి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నడిగడ్డ గ్రామంలోని కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ 100 సభ్యత్వ ప్రమాద భీమా పథకం కింద కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కు రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్త కుటుంబాలకు అండగా ఉండడం పార్టీ బాధ్యత అని అన్నారు. మృతి చెందిన కార్యకర్త సేవలను గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story:టీడీపీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు అందజేసిన జీవి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version