వరల్డ్ టాయిలెట్ డే
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బుధవారం వరల్డ్ టాయిలెట్ డే, హ్యాండ్ వాష్ మన పరిశుభ్రత-మన ఆరోగ్యం డా.బి. ఆర్.అంబేద్కర్ గురుకులం హాస్టల్ లో పై అంశాల మీద అవగాహన నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ శానిటరి ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ. ముందు ముందు ఏమి జరిగినా, వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మరియు మన వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఎల్లప్పుడూ పారిశుధ్యం అవగాహన కలిగి ఉండటం తో పాటు మిగత వారికి కూడా అవగాహన కల్పంచవలసిందిగ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి.వెంకట రావమ్మా, వైస్ ప్రిన్సిపల్ నిర్మల దేవి, శానిటరీ సెక్రటరీలు, మేస్ట్రిలు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story : వరల్డ్ టాయిలెట్ డే )
