రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభోత్సవంలో జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం షోరూమ్‌ను సందర్శించి ఆయన మాట్లాడుతూ. నరసరావుపేట, పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఆధునిక ఫర్నిచర్ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో రామచంద్ర బ్రదర్స్ తీసుకువచ్చిన ఈ మెగా షోరూమ్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యాధునిక నాణ్యమైన ఫర్నిచర్‌ను సముచిత ధరకే అందిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. నిర్వాహకులు ఈ కొత్త షోరూమ్ ద్వారా గృహాలు, కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాల కోసం వినూత్న ఫర్నిచర్ డిజైన్లను అందించనున్నట్లు తెలిపారు. కస్టమర్లకు మరింత ఎంపికలు, మంచి సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర బ్రదర్స్ తరఫున చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులను బొకే అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story:రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభోత్సవంలో జీవీ)

