వంట కుక్కులను సంధ్యారాణి చొరవతోనే సస్పెండ్ చేసారు
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు మండలం ఖారాసు వలస కె జి బి వి ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేసినంత తప్పు ఆమె ఏమి చేసిందని మంత్రి సంధ్యారాణి ఆదేశాలతోనే ఆమెను, వంట కుక్కులను సస్పెండ్ చేయించారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ గిరిజన శాఖ మాత్యులు, వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, పిడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో వి ఆర్ ఓ, వి ఆర్ ఏ,పంచాయితీ కార్యదర్శిలను,అటెండర్లను, కానిస్టేబుళ్లను, సచివాలయ సిబ్బందిని కూడా నియోజకవర్గాలు దాటి బదిలీ చేస్తున్నారని అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఏదైనా అన్యాయం చేస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి అని అన్నారు. మీ అభిమానిగా నేను అడుగుతున్నా ఏదైనా అన్యాయం జరిగితే అడుగుతా అన్నారు,ఏదైనా అక్రమం జరిగితే కడుగుతా అన్నారు,న్యాయం కోసం నీలదీస్తామన్నారు ఇదేనా నిడదీయడం ఇదేనా పరిపాలన?:మాజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అన్నారు. గిరిజన శాఖ మంత్రి నియోజక వర్గంలో చిరు ఉద్యోగులను తొలగిస్తున్నారని ఈ అన్యాయం మీకు కనబడదా పవన్ కళ్యాణ్ అని అన్నారు. కేజీబీవీ ప్రత్యేక అధికారికి సస్పెండ్ చేయవలసినంత తప్పు ఆమె ఏమి చేసారని అధికారులని అడుగుతున్నానని తెలిపారు. వంట సరిగ్గా వండక పోతే వంట వండిన వారిని బాధ్యులను చేయాలి తప్ప ఆమెను ఎలా సస్పెండ్ చేస్తారని అన్నారు. ఆమె ప్రవర్తన బాగోలేదని గానీ,సిబ్బంది గాని, విద్యార్థులు గాని ఎవరైనా మీకు ఫిర్యాదు చేస్తే ఆమెపై చర్య తీసుకున్న అర్థము ఉండేదని ఎవరు కంప్లీట్ ఇవ్వకుండా ఆమె సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు, అధికారులు ఈ విషయాన్ని గ్రహించుకోవాలని అన్నారు. క్రింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా తప్పు చేస్తే కలెక్టర్ మీద ఎవరైనా చర్య తీసుకోగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు పి ఆర్ సి, ఐ ఆర్ ఇస్తామని చెప్పి వారికు ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. నేను 4సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండున్నర సంవత్సరాల ఉన్న సమయంలో నా నియోజకవర్గ పరిధిలో పని చేసిన ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగికైనా బాధ గానీ,ఇబ్బంది గానీ,అన్యాయం గానీ చేశానా, ఏ చిన్న ఉద్యోగునైన తొలగించానా ఇక్కడ పనిచేసిన ఉద్యోగులను అడిగితే తెలుసుకున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి గిరి రఘు, మున్సిపల్ కౌన్సిలర్లు గొర్లె జగన్మోహన్ రావు, సింగారపు ఈశ్వరరావు, గుల్లి పిల్లి నాగ, హరి బాలజీ వైయస్సార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : వంట కుక్కులను సంధ్యారాణి చొరవతోనే సస్పెండ్ చేసారు )