Homeవార్తలుతెలంగాణగుడిపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటిని చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

గుడిపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటిని చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

గుడిపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటిని చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

న్యూస్ తెలుగు/వనపర్తి : కల్వకుర్తి ఎత్తిపోతల గుడిపల్లి రిజర్వాయర్ గేట్లను శుక్రవారం నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి , దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి , DCCB అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి , మన్నేజీవన్ రెడ్డి గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ముందుగా కృష్ణ జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గేట్లను ఎత్తి ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కై కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story :గుడిపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటిని చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!