ఒరిస్సా రాష్ట్రంలో గిరిజన తెగల్లో నేటికీ కొనసాగుతున్న జాతి కట్టుబాట్లు
ఒకే వంశానికి చెందిన వారు, ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం నిషేధం
కట్టుబాట్లు పాటించకపోతే గ్రామ బహిష్కరణ
ఒడిశా లోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
న్యూస్ తెలుగు/చింతూరు/ మునగంటి భాస్కరాచారి, రిపోర్టర్ :
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిహద్దును గల ఒరిస్సా రాష్ట్రం నేటికీ గిరిజన కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. దానికి నిదర్శనమే ఈ కథ. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా కళ్యాణ సింగపురం బ్లాక్ లోని శిఖరపాయి గ్రామ పంచాయతీ లోని గిరిజన గ్రామం అయిన కంజామ జోడి గ్రామంలో గిరిజన సంప్రదాయం నేటికీ కొట్ట వచ్చినట్లు కనపడుతుంది. వివరాల్లోకి వెళితే ఓకే వంశానికి చెందిన వారు, రక్తసంబంధం ఉన్నవారు, ఒకే ఇంటి పేరు గలవారు ఆచారం ప్రకారం వివాహం చేసుకోకూడదు. ఇలాంటి తరుణంలో కుంజామ జోడి గ్రామానికి చెందిన లాక్ సర్కా, కోడియా సర్కా అనే జంట ఓకే వంశంలో తాత/ మామ మేనకోడలు /బాబాయ్ మేనకోడలు మధ్య సంబంధం లో ఒకే వంశానికి చెందినవారు. వారు కలిసి ఉండటం గ్రామ పెద్దలకు ఇష్టం లేదు. తమ సాంప్రదాయాలను వారికి చెప్పిన ప్రేమ జంట విడిపోలేదు. గిరిజన సంప్రదాయం ప్రకారం గ్రామ దేవతకు పూజలు చేసి ఆ జంటకు విచిత్రమైన శిక్ష విధించారు.అదేమిటంటే వ్యవసాయానికి ఎద్దులు, దున్నపోతులు కట్టి పొలం దున్నీనట్లు ఆ జంటకు ఇష్టం లేకపోయినా గ్రామస్తుల బెదిరింపుల తో నాగలి కట్టి పొలం దున్నించారు. మీరు చేసిన పనికి శిక్ష అయిపోయింది. విడిపోవాలి అని గ్రామ పెద్దలు ఆ ప్రేమ జంటకు చెప్పారు. అయినా గాని ఆ జంట విడిపోలేదు. ప్రేమలో పడి సాంప్రదాయాన్ని మరిచిపోయినందుకు గాను, గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ గ్రామపంచాయతీ చేసి గ్రామ బహిష్కరణ చేశారు. ఈ కథకు సంబంధించిన వీడియోలు ఒరిస్సా రాష్ట్రంలో వైరల్ అయ్యాయి. గ్రామ బహిష్కరణ తర్వాత ఆ జంట ఎక్కడికి వెళ్ళింది తెలియదు. విధి వరుస రాష్ట్రంలోని గిరిజన సాంప్రదాయం, సామాజిక నిబద్ధతలు ఇలా ఉంటాయని దానికి నిదర్శనం. (Story:ఒరిస్సా రాష్ట్రంలో గిరిజన తెగల్లో నేటికీ కొనసాగుతున్న జాతి కట్టుబాట్లు)

