సీఆర్ జీవితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం పార్టీ నిర్మాణాన్ని పెంచుదాం
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
న్యూస్ తెలుగు/చింతూరు ; భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపోరాటయోధుడు ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు జీవితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం అని దీనిద్వారా పార్టీ నిర్మాణాన్ని పెంచుదామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ 1914 జూన్ 6న ఆంధ్ర రాష్ట్రంలో మారుమూల గ్రామమైన కృష్ణాజిల్లా మంగలాపురంలో పుట్టిన కామ్రేడ్
సి ఆర్ ప్రపంచస్థాయి నేతగా ఎదిగారని ఆయన అన్నారు దేశ స్వతంత్రం కొరకు వివిధ దశల్లో జరిగిన ప్రజా ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారని అన్నారు చల్లపల్లి జమిందార్ ఆక్రమంలో ఉన్న వేలాది ఎకరాలను వివిధ రూపంలో పోరాటం చేసి పేదల వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేశారన్నారు పేదరికం తగ్గాలంటే భూమి సమస్య పరిష్కారం కావాలని పేదలకు భూములు దక్కాలని బలంగా నమ్మేవారిని ఆయన అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాసంఘాల నిర్మాణానికి విలువైన నిర్మాణ సూత్రాలను ఆయన అందించారని గ్రామాల్లో పట్టణాల్లో ప్రజాసంఘాల నిర్మాణానికి సిఆర్ అందించిన నిర్మాణ సూత్రాలు ఈనాటికీ శిరోధార్యం గా ఉన్నాయన్నారు ఆయన ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్దామని పార్టీ నిర్మాణం చేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అని మధు పిలుపునిచ్చారు .
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి
జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ.
25 సంవత్సరాలు సుదీర్ఘంగా సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు అంటే ఆయన సైద్ధతికత నిర్మాణ దక్షత అందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆయన అందరితో చిరునవ్వుతో పలకరించే వారిని నిరంతరం ప్రజల్లో ఉండేవారని ఆయన గుర్తు చేశారు ఆయన వీలునామా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఇంతటి గొప్పటి విలువైన వీలునామా లేదు అనడం అతిశయోక్తి కాదన్నారు ఆయన అదర్శాలను నేటి యువత అలవర్చుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ టౌన్ కమిటీ సభ్యులు నల్లా రామారావు పి లావణ్య టీ నాగేశ్వరరావు తాడితోట కార్యదర్శి వానపల్లి సూర్యనారాయణ ఏ ఐ వై ఫ్ నగర ప్రధాన కార్యదర్శి
పి త్రిమూర్తులు సిపిఐ తాడితోట శాఖ సహాయ కార్యదర్శి రామరాజు జట్ల సంఘం అధికార పార్టీ సభ్యులు పి దేవుడు బాబు బాలకృష్ణ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (Story : సీఆర్ జీవితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం పార్టీ నిర్మాణాన్ని పెంచుదాం)