పెబ్బేరు మండలంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పర్యటన
న్యూస్‌తెలుగు/వనపర్తి : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే ప్రెస్ క్లబ్ కు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి ఘనంగా సన్మానించారు. గుమ్మడం. మండల పరిధిలోని గుమ్మడం గ్రామంలో ఇటీవల ప్రమాద వర్షాతు దగ్ధమైన నాలుగు గడ్డివాములను ఎమ్మెల్యే సందర్శించి బాధితులకు తక్షణ సహాయనిధిగా ఆర్థిక సహాయం అందించారు, మరియు ప్రభుత్వం తరఫున చేకూరే లబ్దిని అందే విధంగా మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయ్యవారిపల్లి. ఎమ్మెల్యే గారు వివిధ నిధుల ద్వారా మంజూరు చేయించిన ₹ 35 లక్షల వ్యయం గల సీసీ రోడ్ల నిర్మాణాన్ని స్వయంగా ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : పెబ్బేరు మండలంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పర్యటన)