కూటమి ప్రభుత్వం పనితీరుకి
నిదర్శనం మారుతున్న రోడ్లు
వినుకొండ-దొండపాడు తారురోడ్డు పనులు పరిశీలించిన జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ :రాష్ట్రవ్యాప్తంగా రూపుమారుతున్న రోడ్లే ప్రజలు, ప్రజాసమస్యల పట్ల కూటమి పాలన చిత్తశుద్ధి, పనితీరుకి మరో నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గుంతలు కనిపించని రోడ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. అందులో ఇప్పటికే 14వేల కి.మీ. పైగా పూర్తి చేశామని.. గుంతలు పూడ్చుతున్నప్పుడు ప్రజల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. వినుకొండ మండలంలో జరుగుతున్న తారురోడ్డు పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. వినుకొండ నుంచి కుమ్మరిపాలెం, తిమ్మాయపాలెం, శ్రీరామ్ నగర్, పానకాలపాలెం, దొండపాడు మీదుగా రైతునగర్ వరకు రూ.6.15 కోట్ల నాబార్డు నిధులతో తారురోడ్డు పనులు సాగుతున్నా యి. ఆ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న జీవీ.. నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా దెబ్బతిన్న 20వేల కి.మీ. రోడ్లను రూ.861 కోట్ల బాగు చేస్తున్నామన్నారు. వినుకొండ నుంచి దొండపాడు రోడ్డు 2018లోనే మం జూరు చేసి పనులు మొదలు పెట్టినా మధ్యలో వైకాపా పాలనలో అంగుళం కూడా ముందుకు కదల్లేదన్నారు. ప్రమాదాలు జరిగి ప్రజలు గాయపడి, ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత పనులు 25 రోజుల్లో పూర్తి అవుతుతాయని.. 10 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. గుండ్లకమ్మ వాగు మీద 2 వంతెనలు త్వరలో పూర్తి చేస్తామని, ఎక్కడ అవసరమైనా కొత్త రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ 26వేల తీర్మానాలతో రూ. 4500కోట్లతో పనులు చేపట్టారని… అభివృద్ధి విప్లవం చూపిస్తున్నారని అన్నారు. రూ.2,287 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్న జీవీ ఇదే సమయంలో రాష్ట్రానికి 7 నెలల్లో రూ.6లక్షల కోట్ల పెట్టుబడులు రావడం శుభసూచకమన్నారు. వాటిద్వారా 4లక్షల ఉద్యోగాలు రాబోతున్నట్లు తెలిపారు. ఇదే పెట్టుబడులు, పరిశ్రమలు వైకాపా హయాంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పైగా ఉన్నవి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి అని… అవన్నీ ప్రజలు ఆలోచించే 93శాతం కూటమి అభ్యర్థుల్ని గెలిపించారన్నారు. ఆ నమ్మకం నిలబెట్టుకు నేలా స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని. 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉండాలని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున పనిచేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించాలని కోరుతున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. (Story : కూటమి ప్రభుత్వం పనితీరుకి నిదర్శనం మారుతున్న రోడ్లు)