పార్టీలకు అతీతంగా పని చేసుకుందాం ..పట్టణాన్ని అభివృద్ధి పరచుకుందాం
వనపర్తి మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పార్టీలకతీతంగా వనపర్తి పట్టణంలోని అందరం పనిచేసి పట్టణాన్ని త్వరితగతిన పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు
మున్సిపల్ సమావేశం అంటే స్నేహపూర్వక వాతావరణం లో అభివృద్ధి అంశాలపైనే చర్చించాలని పార్టీలకతీతంగా పరస్పర సహకారాలతో వ్యవహరిస్తేనే పట్టణంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్డుల పరంగా కౌన్సిలర్లు పేర్కొన్న సమస్యలను ఆయన విన్నారు. పార్టీలపరమైన భేదాభిప్రాయాలు లేకుండా 33 వార్డులలో ఒకే రకమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు అందరూ సహకరించాలని ఆయన సూచించారు
వనపర్తి పట్టణంలో టాక్స్ లకు సంబంధించి వివరాలు సేకరించి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో రోడ్డు కటింగ్ బాధితులకు కాకుండా ఇతరులకు కేటాయించినట్లు ఉన్న ఆరోపణలపై విచారించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కౌన్సిలర్లు సైతం కలిసి రావాలని ఎమ్మెల్యే కోరారు. పత్రికా మిత్రులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంలోను ఎలాంటి ఆధారాలు లేవని వాటిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించేల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న, పలు దశల్లో పురోగతిలో ఉన్న పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వనపర్తి మున్సిపాలిటీ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అందుకు తాను అన్ని వేళల సహకారం ఉంటదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పదవి కాలం పూర్తయ్య సందర్భంగా ఎమ్మెల్యే పట్టణంలోని కౌన్సిలర్లు అందర్నీ పూలమాలలతో, శాలువాలతో, జ్ఞాపికలతో సత్కరించారు
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కమిషనర్ పూర్ణచందర్, 33 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : పార్టీలకు అతీతంగా పని చేసుకుందాం ..పట్టణాన్ని అభివృద్ధి పరచుకుందాం)