పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించినప్పుడే పట్టణం సుందరి కరణతో పాటు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని మునిసిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణ ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు తెల్లవారుజామున తాను పట్టణంలోని పలు వార్డులలో పర్యటిస్తున్నానని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వలన, మున్సిపల్ కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేటాయించిన స్థలంలోనే చెత్తను వేయాలని గుర్తు చేశారు. అంతేకాకుండా పట్టణంలో ఆటోలు, వ్యాను వీధి వీధికి తిరుగుతున్నాయని, అదేవిధంగా మా కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను కూడా సేకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం వారు చెత్తను వీధిలో పడే వేయకుండా ఇంటిలో ఒక ప్లాస్టిక్ డబ్బులో వేసి చెత్త బండ్లు వచ్చినప్పుడు అందులో వేయాలని తెలిపారు. ఇక నేసే పేట తొగట వీధి లలో గల వాణిజ్య సంస్థల వ్యాపారస్తులు కూడా మూటలు మూటలు ఎక్కడపడితే అక్కడ వేయడం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు, అలా కాకుండా చెత్త వాహనాలలోనే వచ్చినప్పుడు వేయాలని వారు సూచించడం జరిగింది. తదుపరి కాలువల్లో కూడా చెత్తలు వేయడం వల్ల మురికి నీరు ముందుకు వెళ్లడానికి అవకాశం లేకపోవడం రోడ్లపైకి రావడం కూడా జరుగుతోందని తెలిపారు. దీనివలన అపరిశుభ్రముతో పాటు దుర్వాసన, అనారోగ్యాలు కూడా వస్తాయని తెలిపారు. పట్టణములోని సమస్యలు ఏమైనా ఉన్నాయెడల తనకు ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. అంతేకాకుండా పట్టణంలో షెడ్యూల్ తేదీల ప్రకారం నీటిని వదులుతున్నామని, చాలా వార్డుల్లో నీటిని వృధా చేయడం సరియైన పద్ధతి కాదని వారు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడే వేసవికాలంలో మనకు ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో నూతన నిర్మాణాల్లో చేపట్టినప్పుడు తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్ పత్రము పొందాలని, మున్సిపల్ చట్టం పరిధిలోనే వాటిని పూర్తి చేసుకోవాలని తెలిపారు. తదుపరి ఆస్తి పన్ను ,నీటి పన్ను ,ఖాళీ స్థలం పన్ను సకాలంలో డబ్బులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని వారు తెలిపారు. కావున పై విషయాలు పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని వారు తెలిపారు. (Story : పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి )