Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మృతి చెందిన పోలీసు కుటుంబానికి చేయూత

మృతి చెందిన పోలీసు కుటుంబానికి చేయూత

0

మృతి చెందిన పోలీసు కుటుంబానికి చేయూత

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్ తెలుగు/ విజయనగరం : జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి “చేయూత”ను అందించేందుకు పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన మొత్తాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలు అర్ధంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్ధికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత”గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందన్నారు. జిల్లా పోలీసుశాఖలో కొత్తవలస పోలీసు స్టేషనులో ఎస్ఐగా పని చేసిన కే.వెంకటేశ్వర్లు అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు ‘చేయూత’గా పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన రూ. 1,48,400/- ల చెక్ ను వారి సతీమణి కే.బంగారమ్మకు జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ ఎ.ఎస్.వి.ప్రభాకర రావు, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : మృతి చెందిన పోలీసు కుటుంబానికి చేయూత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version