బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : ములుగు పట్టణం పస్లాపల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీకాంత్, దామెర సరోజన, ములుగు పట్టణం సఫా యి గడ్డకు చెందిన ఎంపెల్లి సారయ్య లు ఇటీవలే మరణించగా, వారి కుటుంబాలను ,రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి నీటిసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. అదే గ్రామానికి చెందిన ఉకంటి కిరణ్ అనారోగ్యంతో బాధ పడుతుండగా అయన వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క)