ప్రజల వద్ద మెప్పు పొందే వారే నిజమైన కళాకారులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రజల వద్ద మెప్పు పొందే వారే నిజమైన కళాకారులు అని శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువును బాబు బాలాజీ, కమలా బాలాజీ, రామ లాలిత్య తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు తమ అలసటను,బాధను మరిపించి, అందరిలో ఉత్సాహం,ఉల్లాసం,సంతోషం కలిగించేవి కళలు అని తెలిపారు.ఎటువంటి కళ లను నేర్చుకొని,ప్రదర్శించి,తమ ప్రతిభతో అందరి చేత మెప్పు పిందె వారే కళాకారులు అని తెలిపారు.కళలు సాధన తో మాత్రమే రావు అని, అవి దైవ దత్త మైనవి భగవంతుని అనుగ్రహం తో వచ్చేవి అని స్పష్టం చేశారు.అందుకే కళాకారులు అందరితోనూ గౌరవించ బడతారు,ఎంతో కృషి,సాధన,ఏకాగ్రత ,కష్టం అన్నీ కలగలిపితే కళాకారులు గా గుర్తింపు వస్తుంది అని తెలిపారు.ఏ కళ లో నైనా రాణించాలంటే అంతా సులభం కాదు అని, ఎన్నో బాధలకు,ఒడిదుడుకులకు, ఓర్చుకొని,ఓపికతో దానిలో విజయం సాధించాలి అని తెలిపారు.. అటువంటి కళాకారులందరికి ఈరోజు ప్రపంచ కళాకారుల దినోత్సవ సంధర్భంగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. (Story : ప్రజల వద్ద మెప్పు పొందే వారే నిజమైన కళాకారులు)