తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ & ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గీతాంజలి లీడ్ స్కూల్ విద్యార్థిని
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక గీతాంజలి లీడ్ స్కూల్ విద్యార్థిని ఇండియా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు నమోదు చేశారాని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి తేళ్ల కృష్ణవేణి తెలిపారు. 2వ తరగతి విద్యార్థిని బేబీ అన్నా జ్ఞానషిఖ ఒక నిముషంలో అతి చిన్న వయసులో అత్యధిక హోలా స్పిన్స్ చేసిన బాలికగా బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు నమోదు సీజెశారు. 60 సెకండ్ల సమయంలో 170 సార్లు హోలా రింగ్ను స్పిన్ చేసి ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారి జ్ఞానషిఖను అభినందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ వై.యల్.కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ & ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గీతాంజలి లీడ్ స్కూల్ విద్యార్థిని)