కొత్త కోర్సులలో అడ్మిషన్లు స్వీకరణ
ఐటిఐ ప్రిన్సిపాల్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ప్రభుత్వ ఐటిఐ ఏటూరునాగారం నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6 రకాలైన కొత్త కోర్సులలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అడ్మిషన్ల కొరకు ఉపాధి, శిక్షణ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు వరంగల్ శ్రీ సీతారాములు సమీక్ష నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో వాజేడు ఐటిఐ ప్రిన్సిపాల్ శేఖర్, ఏటూరునాగారం ఐటిఐ ప్రిన్సిపాల్ కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి,కాజీపేట ఐటిఐ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమీక్ష నందు సీతారాములు మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్ డి డి ప్రిన్సిపల్, ఐటిడిఏ పిఓ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగినదన్నారు. స్థానిక తహసిల్దార్ జగదీష్ ని,కూడా కలవడం జరిగిందని,అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అడ్మిషన్ల కొరకు పిఓ కు వివరించడం జరిగినదని తెలిపారు.ఈ విషయమై పిఓ 18 న తారీఖున మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పదవ తరగతి పాసైన విద్యార్థిని విద్యార్థులు 18న గిరిజన భవన్ లో జరిగే అవగాహన సదస్సుకు తమ ఆధార్ కార్డు పదవ తరగతి పాసైన సర్టిఫికెట్లతో హాజరుకావాలని విద్యార్థులందరినీ కోరడం జరిగిందని పేర్కొన్నారు. (Story : కొత్త కోర్సులలో అడ్మిషన్లు స్వీకరణ)