మీడియా కొరకు..సీతారాం ఏచూరి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదు
సిపిఐ (ఎం)
న్యూస్‌తెలుగు/ తిరుపతి : సీతారామ్ ఏచూరి గారిని బ్రతికించటానికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్యులు శక్తి కొలది ప్రయత్నించారని, అయినా, దురదృష్టవశాత్తు అన్ని ప్రయత్నాలు విఫలమై ఆయన మరణించారని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు .
సీతారాం ఏచూరి గారికి సరైన వైద్య సౌకర్యం అందకుండా బిజెపి నాయకత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ చేసిన ప్రకటనను సిపిఎం ఖండిస్తున్నదని తెలిపారు.
నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిమ్స్ లో చేరినందునే మరణించారని చెప్పడం వాస్తవం కాదని, ఎయిమ్స్ ఒక ప్రభుత్వ రంగ ఆసుపత్రి అని దేశంలోనే ఉన్నత శ్రేణికి చెందిన వైద్యులు అక్కడ ఉన్నారని ఆయన అన్నారు.
చింతా మోహన్ ప్రకటన ఎయిమ్స్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని హాస్పిటల్లోని వైద్యులు చివరి వరకు ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారని, ఉన్నత స్థాయిలో వైద్యుల బృందాన్ని నియమించారని తెలిపారు.
పార్టీ కేంద్ర నాయకత్వం అన్ని రోజులు అటు వైద్యులతోనూ, ఇటు సీతారాం కుటుంబ సభ్యులతోనూ పూర్తిస్థాయిలో సమన్వయం చేసిందని వివరించారు.
చింతా మోహన్ చేసిన ప్రకటనకు ఎటువంటి ప్రాతిపదిక లేదని అన్నారు.
డాక్టర్లకు దురుద్దేశాలు అంటగట్టే ఆయన ప్రకటనను సిపిఎం తిరస్కరిస్తున్నదని నాగరాజు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
(Story : మీడియా కొరకు..సీతారాం ఏచూరి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదు)
వందవాసి నాగరాజు
సిపిఐ(ఎం) తిరుపతి జిల్లా కార్యదర్శి