ఐటిడిఏ గిరిజన ఇంజనీరింగ్ సమస్యలపై సమీక్షా
న్యూస్ తెలుగు /ములుగు : హైదరాబాద్ చీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ శంకర్ తో, గురువారం, ఏటూరునాగారం ఐటిడిఏ పి ఓ ఛాంబర్ లో, పిఓ చిత్ర మిశ్ర ఇంజినీరింగ్ సమస్యలపై సమీక్షా నిర్వహించారు.ఐటీడీఏ ఏటూరునాగారం ఇంజినీరింగ్ విభాగానికి కేటాయించిన అన్ని పనులు, దాని గ్రౌండింగ్, పనులు పూర్తి, పెండింగ్‌లో ఉన్న పనులు మొదలైన వాటిపై చర్చించారు.
ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో పనులు మంజూరయ్యాయని, సాంకేతిక సమస్యల వల్ల పనులు ప్రారంభం కాలేదని, ఆ పనులను త్వరగా గ్రౌండింగ్ చేయాలని,ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్‌కు కోరారు. ఈ చర్చలో గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.వీరభద్రం పాల్గొన్నారు. (Story : ఐటిడిఏ గిరిజన ఇంజనీరింగ్ సమస్యలపై సమీక్షా)