Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

0

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర

న్యూస్‌ తెలుగు/విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అన్నారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్‌ గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్‌, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల్‌ రోడ్‌, ఉడా కాలనీ, న్యూ రాజీవ్‌నగర్‌, కండ్రిక జర్నలిస్ట్‌ కాలనీ, 33 తోముల రోడ్డు, ఆంధ్రజ్యోతి రోడ్డు, పీఎన్‌టీ కాలనీ, వాంబే కాలనీ, పైపుల రోడ్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని సైడ్‌ డ్రెయిన్లలో పూడికలు ఎప్పటికప్పుడు తొలిగించి రోడ్లన్నీ పరిశుభ్రంగా ఊడవాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలిగించటంతో పాటు రోడ్లన్నీ నీళ్లతో శుభ్రపర్చి నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా వరదనీటి నిల్వలు ఉంటే వెంటనే వాటర్‌ పంపులతో తొలిగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ, దోమలు, వాటి వల్ల కలిగే వ్యాధులు రాకుండా నిరంతరం యాంటీ లార్వే ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో వీఎంసీ సీఎంఓహెచ్‌ డా.పీ.రత్నావళి, ఈఈ శ్రీనివాస్‌, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. (Story : ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version