డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
విశ్వేశ్వర్ రెడ్డి ని సన్మానించిన 30వ వార్డు మాజీ కౌన్సిలర్, సభ్యులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలో దాదాపు అర్థ శతాబ్దం కాలంగా ప్రజలకు సేవ చేసే నలుగురి డాక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారిని చిన్నప్పటినుండి అభిమానించే వారిలో ఒకరుగా ఉన్న మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ వార్డు సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. గాంధీచౌక్ ప్రాంతంలో విశ్వేశ్వర్ రెడ్డి ఎప్పటినుండో క్లినిక్ పెట్టి చుట్టుపక్కల గ్రామాలు, అక్కడ నివసించే పేద ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ, ఇప్పటికీ చేయి చూసి మందులు ఇస్తే ఏ రోగమైన వెంటనే తగ్గిపోతుందని వారి వద్దకు వెళ్తే తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందుతుందని సతీష్ యాదవ్ తెలిపారు. విజేత రాములు, గుంట్ల విష్ణు, బాలస్వామి, నిఖిల్ గౌడ్,రాకేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. (Story : డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు)