వరద బాధితుల సహాయార్థం భాష్యం విద్యాసంస్థల ఆర్థిక సాయం
సీఎం సహాయ నిధికి నాలుగు కోట్ల చెక్కు అందజేత
న్యూస్ తెలుగు/సాలూరు: తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి విపత్తు పరిస్థితులు వచ్చిన భాష్యం విద్యాసంస్థలు సహాయ సహకారాల అందిస్తుందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ అన్నారు. శనివారం విజయవాడ వరద బాధితుల సహాయార్థం నాలుగు కోట్ల రూపాయలు చెక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పిల్లలతో పాటు ఆయన ఈ చెక్కును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో విపత్తు పరిస్థితులు వచ్చిన భాష్యం విద్యా సంస్థలు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ సహాయ సహకారాలు అందించిన విద్యార్థులకు . తల్లిదండ్రులకు భాష్యం టీచింగ్ &నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వరద బాధితుల చెక్కును అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భాష్యం విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.(Story:వరద బాధితుల సహాయార్థం భాష్యం విద్యాసంస్థల ఆర్థిక సాయం)