సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం విరమించుకోవాలి : ఏఐటియుసి
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ) : సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం విరమించుకోవాలని, తెలంగాణా మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్, ఏటూరునాగారం మండల కమిటి నాయకులు పోరెడ్డి ప్రమీల, రమక్క, సరోజజన డిమాండ్ చేశారు. సోమవారం ఏటూరునాగారం మండల విద్యాశాఖాధికారి కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందచేసి,వంట కార్మికులు, వంట కార్యక్రమాన్ని హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా వంటలు చేయడానికి ప్రయత్నించడం విరమించుకోవాలని కోరారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన రూ 10 వేల వేతనం వెంటనే అందించాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు తరగతి తో సంబంధం లేకుండా,ప్రతీ విద్యార్థికి రూ 25 చెల్లించాలని,ఇంకా అనేక సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏటూరునాగారం మండల కమిటీ నాయకులు,పోరెడ్డి ప్రమీల,రామక్క,సరోజన,సమ్మక్క,సమ్మక్క,బుజ్జక్క,పార్వతి, లక్ష్మి, లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు (Story : సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం విరమించుకోవాలి : ఏఐటియుసి)