పల్నాడు జిల్లా రైతాంగ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి.
న్యూస్‌తెలుగు /నరసరావుపేట : సోమవారం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పల్నాడు జిల్లాలో పనిచేయని లిఫ్ట్ ఇరిగేషన్ లను వెంటనే రిపేరు చేయించి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఉమ్మడి జిల్లా కలెక్టర్ కి నూతన పల్నాడు జిల్లా కలెక్టర్లకి అనేకసార్లు పల్నాడు జిల్లాలో సుమారు 155 లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు ఉన్నాయని వాటిల్లో కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయని కొన్ని రిపేర్ లో ఉన్నాయని అనేక పర్యాయాలు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని వెంటనే అధికారులకు ఆదేశించి ఎస్టిమేషన్ వేయించి నిధులు విడుదల చేసి రిపేర్లు చేయించాలని రెండు లక్షల ఎకరాలు భూమి సాగులోకి తెచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా అదేవిధంగా పల్నాడు జిల్లాలో నకిలీ విత్తనాలను నకిలీ ఎరువుల ను జిల్లా నుండి పారదోలాలని అదేవిధంగా రైతులకు ఎరువులు విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందే విధంగా చూడాలని రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో ఇప్పించాలని అనేక అంశాలపై ఈరోజు పల్నాడుజిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి వివరించడం జరిగిందని రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి .ఈశ్వరయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బాబురావు సాంబశివరావు వెంకట్రావు శ్రీనివాస్ అనేకమంది రైతు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . (Story : పల్నాడు జిల్లా రైతాంగ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా)