పితృ పక్షాల సందర్భంగా ప్రత్యేక యాత్ర రైలు
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: భారతీయ రైల్వేలు-భారత్ గౌరవ్ పథకం కింద సేవలను అందించే అత్యంత విజయవంతమైన ప్రైవేట్ రైలు సౌత్ స్టార్ రైలు, పితృ పక్షాల సందర్భంగా, తమ తదుపరి పర్యటనను ప్రకటించింది. ప్రయాగ్ రాజ్ -కాశీ-గయా-అయోధ్య-మథుర-ఉజ్జయిని-ఓంకారేశ్వర్-సోమనాథ్ – ద్వారకా – మాతృగయకి 14.09.2024-28.09.2024 (15 రోజులు). ఈ యాత్ర పవిత్ర నగరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత, కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఈ పర్యటనలో పితృ పక్షాల సందర్భంగా గయా, మాతృగయలో పిండ తర్పణంచేయటం, వారణాసి ఆధ్యాత్మిక ఆకర్షణను అన్వేషించడం, అయోధ్యలోని రామమందిరంను సందర్శించడం, మథుర, ద్వారకా, సోమనాథుని దర్శనం, ఉజ్జయినిలోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వరులని దర్శించుకోవటం మరియు ప్రయాగ్‌రాజ్ పవిత్ర సంగమ స్నానం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించడం వంటివి ఉన్నాయి. (Story : పితృ పక్షాల సందర్భంగా ప్రత్యేక యాత్ర రైలు)