ప్రశంసలు అందుకుంటున్న ‘కమిటీ కుర్రోళ్ళు’
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది.
ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటోంది ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా. సూపర్ స్టార్ మహేష్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా హీరో నాని, డైరెక్టర్ నాగ్ అశ్విన్, డైరెక్టర్ క్రిష్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కమిటీ కుర్రోళ్ళు సాధించిన సక్సెస్‌ను అప్రిషియేట్ చేశారు.
* యంగ్ టీమ్ సాధించిన పెద్ద విజయం. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు థియేటర్స్‌లో మంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిసింది. డైరెక్టర్ యదు వంశీ, నిర్మాత నిహారిక సహా ఎంటైర్ టీమ్‌కు అభినందనలు – రాజమౌళి
* ‘కమిటీ కుర్రోళ్ళు’ మంచి విజయం సాధించిందనే న్యూస్ వినటం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నిర్మాత నిహారికకు, డైరెక్టర్ యదు వంశీకి బ్లాక్ బస్టర్ సాధించినందకు అభినందలు. అలాగే మన్యం రమేష్‌గారికి, వంశీ నందిపాటిగారికి కంగ్రాట్స్ – సుకుమార్
* నిహారి కొణిదెలతో పాటు ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్‌కు అభినందనలు. చాలా మంది యంగ్ టాలెంట్ ఈ సినిమాతో తమని తాము ప్రూవ్ చేసుకున్నారు – నాగ్ అశ్విన్
* ‘కమిటీ కుర్రోళ్ళు’ గురించి చాలా గొప్పగా విన్నాను. నిహారిక కొణిదెలతో పాటు ఎంటైర్ టీమ్‌కు అభినందనలు – నాని
* ‘కమిటీ కుర్రోళ్ళు’ రోలర్ కోస్టర్ మూవీ. స్నేహం, ప్రేమ, భావోద్వేగాలన్నీ చక్కగా కుదిరాయి. కొత్త నటీనటులైనా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ యదు వంశీకి హ్యాట్సాఫ్.. అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న నిర్మాత నిహారికకు అభినందనలు – క్రిష్
* ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి చాలా పెద్ద కంగ్రాట్స్. అద్భుతమైన విజయం. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ సాధించిన నిహారికకు అభినందనలు. మీ గొప్ప ప్రయత్నం చేశారు. ఇలాంటి విజయాలను మరెన్నింటినో సాంచాలి – దేవి శ్రీ ప్రసాద్
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఆదివారం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని, కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. (Story : ప్రశంసలు అందుకుంటున్న ‘కమిటీ కుర్రోళ్ళు’)