Home వార్తలు ఆగస్ట్ 4న వైజాగ్‌లో  ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్

ఆగస్ట్ 4న వైజాగ్‌లో  ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్

0

ఆగస్ట్ 4న వైజాగ్‌లో  ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి, ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ ట్రైలర్ ఆగస్ట్ 4న విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుంది. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ పై ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ లో చేరుకుంది.  ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, మూవీకి మరింత బజ్‌ని క్రియేట్ చేస్తోందని ప్రామిస్ చేయనుంది.

డబుల్ ఇస్మార్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, కావ్యా థాపర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా, డీవోపీగా సామ్ కె నాయుడు, జియాని జియానెలీ పని చేస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు. (Story : ఆగస్ట్ 4న వైజాగ్‌లో  ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version