రేపు హాట్‌స్టార్‌లో కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
న్యూస్‌తెలుగు/ముంబయి: వెస్ బాల్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ గ్లోబల్ ఎపిక్ ఫ్రాంచైజీకి కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌తో కొత్త జీవితాన్ని అందించాడు. ఇది సీజర్ పాలన అనంతరం అనేక తరాల తర్వాత జరిగిన కథ. ఈ యుగంలో, కోతులు సామరస్యపూర్వకంగా జీవిస్తున్న ఆధిపత్య జాతులు. అయితే మానవులు నీడలో నివసించే స్థితికి చేరుకుంటారు. ఒక కొత్త నిరంకుశ కోతి నాయకుడు తన సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు, ఒక యువ కోతి భయంకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. గతం గురించి తనకు తెలిసిన ప్రతిదాన్నీ ప్రశ్నిస్తుంది. కోతుల, మానవుల కోసం భవిష్యత్తును నిర్వచించే ఎంపికలను చేస్తుంది. ఆగస్టు 2న డిస్నీG హాట్‌స్టార్‌లో ఇది ప్రసారం కానుంది. అద్భుతమైన ఫ్రాంచైజీలోని ఈసారి వీక్షకులను ఉత్తేజపరిచే, ఆకట్టుకునే ఎపిక్ గాథను కొనసాగిస్తుంది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రసారం అవుతుంది. (Story : రేపు హాట్‌స్టార్‌లో కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్)